కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం గన్నవరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, పలు రిజిస్టర్లు, దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ అంశాలకు సంబంధించిన నెలవారీ నివేదికలు, సర్వేల పురోగతి, కార్యాలయంలోని ఖాళీ పోస్టులు వంటి వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, కార్యకలాపాలు, బౌండెడ్ లేబర్, అర్జీల పరిష్కారం వంటి అంశాలపై కూడా ఆయన ఆరా తీశారు.