గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను సహించేది లేదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆక్రమణదారులను హెచ్చరించారు. బుధవారం బుద్దవరం, కేసరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, వాటి పరిష్కార వివరాలను ఆరా తీశారు. ప్రజల అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. దావాజీగూడెం గ్రామం నుండి గన్నవరం వరకు రహదారి ఆక్రమణలకు గురైందని ఆయన తెలిపారు.