విజయవాడలో వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణాలను బలిగొంది. గన్నవరానికి చెందిన ఓ యువతి, తన భర్త స్నేహితుడైన వంశీతో సంబంధం పెట్టుకుంది. బుధవారం, ఆమె తన 18 నెలల కుమార్తెతో కలిసి విజయవాడలోని వంశీ ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన గొడవలో, వంశీ చిన్నారిని కొట్టడంతో తల గోడకు తగిలి మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.