కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్ని నాని మర్యాదగా మాట్లాడితే మర్యాద దక్కుతుందని, అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ పేర్ని నాని తన స్థాయిని మరిచి జుగుప్సాకరమైన భాషలో మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దిగజారుడు
రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు.