విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, సమాజానికి మూల స్తంభాలుగా ఉన్న జర్నలిస్టులకు కనీస వేతనాలు అందించేలా నూతనంగా ఎన్నికైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.