గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విదేశాలకు వెళ్లేందుకు గురువారం హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఆయన పాస్‌పోర్ట్ అడ్డంకులను తొలగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత వైసిపి ప్రభుత్వంలో, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వెంకట్రావు టీడీపీలో చేరి లోకేష్‌తో కలిసి నడిచారు. ఆ సమయంలో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో వైసీపీ శ్రేణులు పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.