గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని వీరంకి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని భావించి దొంగలు ప్రవేశించారు. సుమారు రూ. 20 లక్షల విలువైన 16 తులాల బంగారం, వెండి వస్తువులను అపహరించారు. ఈ ఘటనపై గురువారం ఇంటి యజమాని వీరంకి వెంకటేశ్వరరావు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.