మంగళవారం రామవరప్పాడులో జరిగిన ప్రజా దర్బార్ లో గన్నవరం నియోజకవర్గ ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని, సస్పెన్షన్కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే నియోజకవర్గం విడిచి వెళ్లాలని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.