కృష్ణా జిల్లాలోని పలు పట్టణాల్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వైసీపీ, కూటమి నేతల మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గంలో ఎస్ఐలు బీట్ లలో పర్యవేక్షణ చేశారు.