జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం రాత్రివేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ నిర్వహిస్తూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. గన్నవరంలో సోమవారం రాత్రి ప్రార్థన మందిరాలు, ఏటిఎంలు, మరియు ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘాను పెంచి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసారు.