గన్నవరం: ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

1చూసినవారు
గన్నవరం: ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవల్లి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ సత్యం సురేష్ వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందనే దానిపై అవగాహన కల్పించారు. ఈ డ్రైవ్ ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహను పెంచే ప్రయత్నం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్