ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక శుక్రవారం జరిగింది. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ తనిఖీలో, డిఆర్పిలు నివేదికలు సమర్పించారు. సామాజిక తనిఖీ బృందం ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి 9,79,359 రూపాయలు రికవరీ చేసి, వేతనదారులకు తిరిగి చెల్లించాలని నివేదించింది.