అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గన్నవరం ఎస్‌ఐ ప్రశాంతి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా విద్యార్థినులలో మహిళా సాధికారత, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆమె విద్యార్థినులకు సూచించారు.