నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన అండర్ 17 బాలికల రగ్బీ పోటీలలో ప్రతిభ కనబరిచిన చింతల స్వప్న కుమారి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. డిసెంబర్ రెండో వారంలో భువనేశ్వర్‌లో జరగనున్న ఈ పోటీలలో ఆమె పాల్గొంటుంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆదివారం తెలిపారు. స్వప్న కుమారి వీరపనేనిగూడెం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని.