ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ బుధవారం కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా జీతాలు తీసుకోవడం దొంగతనం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు ప్రతినెల జీతాలు తీసుకోవడం దారుణమని ఆయన అన్నారు.