గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం రాత్రి బాపులపాడు మండలం రెమల్లె గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.