గన్నవరం మండలం ముస్తాబాద్ లోని డ్వాక్రా మహిళలు సోమవారం వెలుగు ఏపీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడు నెలలుగా గ్రామానికి రాకుండా, తనకు అనుకూలమైన వారికి సహకరిస్తున్నారని, ఫోర్జరీ సంతకాలతో తమ ఖాతాల నుంచి రూ. 1. 70 లక్షలు మాయమైనా స్పందించలేదని బాధితులు పేర్కొన్నారు. అన్యాయంగా నగదు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.