ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య!

10చూసినవారు
ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య!
పోరంకిలోని శ్రీ చైతన్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం. పవన్ కుమార్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్