కృష్ణా జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గన్నవరం మండలం, కేసరపల్లిలో 18 ఏళ్ల విద్యార్థి యశ్వంత్ కళాశాల క్యాంపస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.