గన్నవరం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది దోనేపూడి సాంబశివరావు మృతిచెందారు. గన్నవరం నుంచి విజయవాడ వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సాంబశివరావు అక్కడికక్కడే మరణించగా, ఆయన కుమారుడు గాయపడ్డారు.