కేసరపల్లి విచారణ గురువులు ఫాదర్ నూతలపాటి కిషోర్ మాట్లాడుతూ, కతోలిక క్రైస్తవులకు దివ్య బలి పూజ అత్యంత ప్రాముఖ్యమైన గొప్ప ప్రార్థన అని, దివ్యబలి పూజ విషయంలో బ్రదర్ జోసఫ్ తంబి ఎంతో ఆదర్శనీయులని అన్నారు. ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఈనెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న బ్రదర్ జోసఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల నవదిన ప్రార్థనలు ఏడవ రోజుకు శనివారం చేరుకున్నాయి. ఈ సందర్భంగా జోసఫ్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.