రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

7చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కొండపావులూరు వద్ద విజయవాడ బైపాస్ పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య కుమారి(33) మృతి చెందగా, భర్త సంగంరెడ్డి రామునాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని రాణిగారితోటకు చెందిన దంపతులు పెళ్లిరోజు పురస్కరించుకుని ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కారును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్