గుడివాడ: బస్టాండ్ లో నిలిచిపోయిన వర్షపు నీరు

71చూసినవారు
గుడివాడలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి బస్టాండ్ చెరువును తలపిస్తోంది. బస్టాండ్‌లో వర్షపు నీరు చేరడంతో లోపలికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గుడివాడ బస్టాండ్ శాశ్వతంగా నిర్మించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్‌లోని వర్షపు నీటిని తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్