గుడివాడ మండలం లింగవరం గ్రామంలో తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల కంచెలు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన కంచెలను తొలగించారు. అధికారులు చేపట్టిన సత్వర చర్యలతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, వాహనదారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.