వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి అనుచరుడు, గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఎస్సై అని చెప్పుకుంటూ, మోటూరులోని గంగానమ్మ దేవస్థాన పూజారి వెంకట రామయ్యను బెదిరించి, గుడి తాళాలు, బోర్ మోటార్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.