దిత్వా తుఫాను నేపథ్యంలో గుడివాడ మండలం చిరిచింతల రైతులు ధాన్యం ఎగుమతి కాక ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రోడ్డుపై ధాన్యం నిల్వ ఉండటంతో, వర్షం పడితే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని, తేమ శాతం సాకుతో ఇబ్బందులు పెడుతున్నారని, నిబంధనలు సడలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.