గుడివాడలో క్రికెట్ బెట్టింగ్‌.. నలుగురు యవకుల అరెస్ట్

7చూసినవారు
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్‌.. నలుగురు యవకుల అరెస్ట్
గుడివాడ మండలం నాగవరప్పాడులోని ఓ టీ కొట్టు కేంద్రంగా సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠాను వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్‌లు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్