స్థానిక
ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, యువతరం క్రీడలతో పాటు క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఆయన క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వందలాది చిన్నారి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.