గుడివాడ బస్టాండ్ సెంటర్లో మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులపై ట్రాక్టర్ ను దూయబోయాడు. స్థానికులు వెంటనే ట్రాక్టర్ తాళాలు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ ను ట్రాక్టర్ పై నుంచి దించి, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ తో వాగ్వివాదానికి దిగారు.