గుడివాడ బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం డ్రైనేజీ కాలువలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.