గుడివాడ: నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు

17చూసినవారు
గుడివాడ: నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గుడివాడ పట్టణం పదో వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :