దేశాభివృద్ధికి కార్మిక సంఘాలే అడ్డంకి అన్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం గుడివాడలో మాట్లాడుతూ, కార్మికులు లేనిదే ఉత్పత్తి సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తోందని విమర్శించారు. కార్మికుల విలువను తగ్గించేలా పాలకులు వ్యవహరించడం సరికాదన్నారు.