గుడివాడ మండలం మల్లాయిపాలెంకు చెందిన ఓ వృద్ధుడు, పద్మావతి మిల్లులో కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సైకిల్ పై రైస్ మిల్లు వైపు వెళ్తుండగా, బైక్ ను చూసి భయంతో సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.