రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని గుడివాడ ఏవో అనంతలక్ష్మి సూచించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి రైతులతో మాట్లాడారు. యంత్రాలతో వరి కోతలు కోయవద్దని, రెండు మూడు రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ధాన్యరాశులు కప్పుకునేందుకు అవసరమైన రైతులకు టార్ఫాలిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.