కృష్ణా జిల్లాలో ఇంటి పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారిణి అరుణ జప్తు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని పలు పట్టణాల్లో పన్ను వసూళ్లపై ఆమె కార్యదర్శులతో సమీక్షించారు. నీటి కుళాయి బకాయిలు చెల్లించని వారి టాపులకు డమ్మీలు వేయాలని సూచించారు. జిల్లాలో కేవలం 324 పంచాయతీలు మాత్రమే నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేశాయని తెలిపారు.