గుడివాడ: టీడీపీ కార్యాలయం పేరిట మోసం

1చూసినవారు
గుడివాడ: టీడీపీ కార్యాలయం పేరిట మోసం
గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి, ఇద్దరు సైబర్ నేరగాళ్లు క్యాటరింగ్ నిర్వాహకులను మోసం చేశారు. 9398053148 నంబర్ నుంచి ఫోన్ చేసి, వెయ్యి మందికి పార్టీ మీటింగ్ కోసం భోజనాల ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. GST బిల్లుల పేరుతో ముందుగా డబ్బు పంపాలని ఫోన్ పే స్కానర్ పంపగా, నమ్మిన బాధితులు రూ. 75 వేలు పంపించి మోసపోయారు. ఎమ్మెల్యే పీఏను సంప్రదించగా, అలాంటి ఆర్డర్లు ఏవీ ఇవ్వలేదని తేలింది. ఇలాంటి మోసాలను నమ్మవద్దని ఎమ్మెల్యే కార్యాలయం హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్