గుడివాడ: అధికారుల తీరు పట్ల అసహనం

7చూసినవారు
గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని శుద్ధి చేయడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ప్రజావేదికలో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, రా వాటర్, ఫిల్టర్ చేసిన నీటి నమూనాలను పరిశీలించిన ఆయన అధికారుల పనితీరు పట్ల ఆసహనం వ్యక్తం చేశారు. తాగునీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్