గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన యువకులు గంజాయికి బానిసై, తమ ఖర్చుల కోసం పొరుగు రాష్ట్రాల వారితో పరిచయాలు పెంచుకున్నారు. తక్కువ ధరకు గంజాయి తెచ్చి, స్థానిక యువతకు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారనే సమాచారంతో, గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణ సాంకేతిక ఆధారాలతో మంగళవారం 9 మందిని అరెస్టు చేశారు.