గుడివాడ: రూ. 250 కోట్లు నిధులు కేటాయించాలి

2చూసినవారు
గుడివాడ: రూ. 250 కోట్లు నిధులు కేటాయించాలి
గుడివాడలోని టిడ్కో కాలనీ అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు నిధులు కేటాయించాలని కోరుతూ సి94 బ్లాక్ సందులో టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ధర్నా చేపట్టారు. రుణమాఫీ జరిగే వరకు పోరాటం ఆగదని, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల దౌర్జన్యాలు, నోటీసులు, తాళాలు వేస్తామని బెదిరింపులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్