ప్రజల ప్రాణాల భద్రతే పోలీసుల ముఖ్య లక్ష్యమని, రహదారి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ రూరల్ ఎస్ఐ ఎన్. చంటిబాబు తెలిపారు. ఆదివారం సాయంత్రం మల్లాయపాలెం ఎక్స్ రోడ్స్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ సైన్ స్టాపర్ బోర్డులపై రేడియం స్టిక్కరింగ్ పనుల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు అవసరమైన సూచనలు అందించారు.