గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మే 1 నుండి 28 వరకు 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6-8 గంటల వరకు, సాయంత్రం 4:30-6:30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.