మచిలీపట్నం: జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ మంగళవారం మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 7న గుడివాడలోని కేటీఆర్ విమెన్స్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.