గుడివాడ వైసీపీ ప్రచార కమిటీ సభ్యుడు గంట శ్రీనివాసరావుపై మోటూరుకి చెందిన ఓ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనివాసరావు తనపై, తన కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నారని మహిళ ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.