గుడివాడ: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము

9చూసినవారు
గుడివాడ: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పునరుద్ఘాటించారు. గుడివాడలోని ఏలూరు రోడ్డులో గల ప్రజావేదిక కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యే రామును కలిసి వివిధ సమస్యలపై అర్జీలను అందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :