గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం 27, 29 వార్డుల పరిధిలోని బేతవోలులో విస్తృతంగా పర్యటించారు. ప్రజలందరితో కలిసి, కూటమి ప్రభుత్వ సహకారంతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఐక్యతతో ముందుకు వస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 26, 30 వార్డుల పరిధిలో విస్తరించి ఉన్న బేతవోలు చెరువు చుట్టూ ఆయన ద్విచక్ర వాహనంపై కలియతిరిగారు.