కాంట్రాక్టర్లు అవినీతి వైకాపా మత్తు నుండి బయటకు రావాలని. ఇరిగేషన్ పనుల్లో దోపిడీ చేద్దాం అనుకుంటే కూటమి ప్రభుత్వంలో కుదరదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలంలోని దోసపాడు ఛానల్ కాలువను ఎమ్మెల్యే రాము బుధవారం పరిశీలించారు. నెహ్రాలి డ్రాప్ నుండి ఇలపర్రు రెగ్యులేటర్ కింద వరకు రైతులు, అధికారులతో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించారు.