రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1వ తేదీన గుడ్లవల్లేరు మండలంలో డాక్టర్ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభించనున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హేలీప్యాడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.