మైలవరం: అంగన్వాడీల వేతనాలు పెంచేవరకు ఉద్యమిస్తాం.. సిఐటియు

960చూసినవారు
మైలవరం సిడిపిఓ కార్యాలయం వద్ద మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో 1.4 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు సేవలందిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్లకు సంబంధించిన జీవో 5ను సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక యూడిసికి వినతిపత్రం అందించారు.