నందివాడ మండలం పెదలింగాలలో గ్రామస్థులు పంచాయితీ కార్యదర్శిని నిర్బంధించారు. గ్రామస్తులకు సమాచారం లేకుండా అక్రమ చెరువులపై తీర్మానం ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. ఆక్వా జోన్ తమ గ్రామానికి వద్దని నిరసన తెలిపారు. పంచాయితీ కార్యదర్శి నుంచి సమాధానం కోరుతూ గ్రామస్తులు ఆయనను ముట్టడించారు.