గుడివాడలో SIRపై జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ
వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని తమ్ముడి కుమారుడు అర్జునరావు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. కొడాలి నానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారికి రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కొడాలి నాని రాజకీయ వారసత్వంపై చర్చకు దారితీశాయి.